Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 10:45 pm Posted by : ramakrishna

సవతి తల్లి, తండ్రిపై కేసు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మైనర్ వయసు గల తన కూతుర్ని హింసించి పని చేయించిన తండ్రి, సవితి తల్లిపై కేస్ నమోదు చేసినట్లు ఐదో టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కన్న తండ్రి అయిన షేక్  హుస్సైన్ తన రెండో భార్య అయిన రిజ్వాన బెగమ్ తో కలిసి తన కూతురు మైనర్ బాలికను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. 4 సంవత్సారాల క్రితం శైక్ హుస్సైన్ మొదటి భార్య అయిన అహ్మెది బెగుమ్ అనారోగ్యంతో చనిపోయింది. వీరికి ఒక కుమార్తె. శైక్ హుస్సైన్ రిజ్వన బెగుమ్ ను రెండోవా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వీరి వివాహం అయినప్పటి నుండి బాధితురాలిని స్కూల్ మానిపించేశారు. ఇంటి పని చేయిస్తు నరకం చూపించారు. ఉదయం 5 గంటలకు నిద్రలేపి ఇంటి పని చేపించేవారు. పాచిపోయిన అన్నం పెట్టేవారు. కొట్టేవారు, బందువుల ఇంటికి కూడా వెళ్లనిచ్చేవారు కాదు. ఆదే విదంగా ఈనెల 8న అమ్మాయి తండ్రి శైక్ హుస్సైన్, సవతి తల్లి రిజ్వన బెగమ్ లు బాధితురాలిని  భైంసా లోగల అమ్మాయి కి వరసకు అత్తమ ఐనా వజీర్ బీ ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు. వారు ఆ బాధితురాలిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. బాధితురాలకి మామ వరస ఐనా శైక్ హయాత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. బాధితురాలి తండ్రి, సవతి తల్లిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా మైనర్ లను హింసించిన, బండికి పంపకుండా పని చేయించినా వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.