Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 8:37 pm Posted by : ramakrishna

మహిళ ఎస్సై ని వేదించిన ఎస్ఐ పై కేసు నమోదు

 

. . . విఆర్ కు అటాచ్ చేస్తు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ:

 

పాత పాలమూరు జిల్లాలో ఒక ఎస్ఐ తన తోటి బ్యాచ్ మెట్ ఐన మహిళ ఎస్ఐ ని లైంగికంగా వేదించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలిస్ శాఖ సధరు ఎస్ఐ వేదింపులు వాస్తవమేనని గుర్తించి కేసు నమోదు చేయగా అతడిని వెకేన్సీ రిజర్వ్ కు అటాచ్ చేస్తు నారాయణ పేట్ జిల్లా ఎస్పీ డా.వినిత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ పేట జిల్లా మద్దూర్ ఎస్ఐగా విజయ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. విజయ్ కుమార్ తో పాటు ఎస్ఐగా ఎన్నికైన మహిళను లైంగీకంగా వేదించాడు. తన తోటి బ్యాచ్ మెట్ అని చూడకుండా వేదించడంతో బాధితురాలు నారాయణ పేట పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విచారించిన పోలీస్ శాఖ అతడిపై కేసులు నమోదు చేశారు. ఎస్ఐ విజయ్ కుమార్ పై లైంగీక వేదింపుల కేసు నమోదు కావడంతో అతడిని విఆర్ కు అటాచ్ చేస్తు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.