ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టుకొని వాహనం నడుపుతున్న వ్యక్తి పై కేసు నమోదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, బైక్ నడుపుతూ వస్తున్న ఒక వ్యక్తిని ఆపి వాహన పత్రాలు చూపించాలని కోరగా, ఆయన బైక్ నంబర్ TS16EX5260 కు సంబంధించిన ఆర్సీ పత్రాలు చూపించాడు. అతని పై అనుమానం రావడంతో, పోలీసులు బైక్ యొక్క చస్సిస్ నంబర్, ఇంజిన్ నంబర్ పరిశీలించగా, ఆర్సీ పత్రాలలో ఉన్న వివరాలకు సరిపోలకుండా వేరుగా ఉన్నట్లు తేలింది, వెంటనే అతన్ని విచారించగా నగరంలోని గౌతంనగర్ లో గల దుబ్బ...