మాచారెడ్డి మండలంలో ఐదుగురు సర్పంచ్ లపై కేసు నమోదు

మాచారెడ్డి, బతుకమ్మ :    కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఐదు గ్రామాల సర్పంచ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పంచాయితీ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు కోతుల బెడద, కుక్కల బెడద లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు వారు చట్టాన్ని చేతులోకి తీసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేయాల్సి వచ్చింది. మాచారెడ్డి మండలం భవానిపేట్, పాల్వాంచ, వాడి, ఫరీద్ పేట్, బండరామేశ్వర్ పల్లి గ్రామాల్లో గ్రామ సింహాలకు  స్థానిక ప్రథమ పౌరుల ఆధ్వర్యంలో కుక్కలను హతమార్చినట్లు తెలిసింది. ప్రధానంగా...