బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ గ్రామ శివారులో 161 జాతీయ రహదారిపై గల 36 ధాబాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలతో పాటు సిట్టింగ్ వంటి కార్యకలాపాలు చేయడంతో పోలీసు వారు రైడ్ చేసి దాబా యజమాని అయిన బలిజ గంగాధర్ పై కేసు నమోదు చేసి 50 వేల రూపాయల జరిమానా విధించనైనది .అని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు. గతంలో తేదీ 26/06/2025 రోజున ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మకాలు చేయడంతో గతంలో కేసు నమోదు చేసిన పోలీసులు అయినప్పటికీ దాబా యజమానిలో ఎలాంటి మార్పు లేకపోగా తాజాగా తేదీ 22/09/2025 నాడు మరల 36 దాబా నందు అక్రమంగా సిట్టింగ్ ఏర్పాటు చేసి మద్యం తాగుతుండగా పోలీసు వారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. మొదటి చేసిన బైండోవర్ ను అతిక్రమించినందున దాబా యజమాని అయిన బలిజ గంగాధర్ పై 50వేల రూపాయలు జరిమానా విధిస్తూ ఎమ్మార్వో వద్ద బైండోవర్ చేయించడం జరిగిందని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలియజేశారు.