Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 November 2025, 10:22 pm Posted by : ramakrishna

తెయూలో 2012 నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు 

  • అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు రద్దు
  • పుష్కరకాలం తర్వాత 45 మంది ఆచార్యులపై వేటేనా..?

 

నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2012లో జరిగిన నియామకాలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం న్యాయమూర్తి నగేష్ బీమపాక తీర్పులో అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకాలను రద్దు చేశారు. 2012 ఫిబ్రవరి 25న ఆనాటి ఉపకులపతి ప్రొ.డా.అక్బర్ ఆలీఖాన్ సైన్స్, ఆర్ట్స్ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి మూడు నోటిఫికేషన్లను విడుదల చేశారు. ఫార్మాసుటికల్, కెమిస్ట్రీ, అప్లయిడ్, ఎకనామిక్స్ లో 5 సంవత్సరాల కోర్సుల్లో బోధన కోసం ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే పోస్టుల భర్తీ సమయంలో ఐదేళ్ళ కోర్సును ఎత్తివేసి పోస్టులను భర్తీ చేశారు. తర్వాత ఐదేళ్ళ కోర్సును ప్రవేశపెట్టారు. దానివల్ల నష్టపోయిన వెంకట్ నాయక్ అనే అభ్యర్థి రోస్టర్ పాయింట్లలో అన్యాయం జరిగిందని హైకోర్టను ఆశ్రయించాడు. అయితే హైకోర్టు నియామకాలపై స్టే ఇచ్చింది. 2013లో అప్పటి వీసీ అక్బర్ ఆలీఖాన్ ఒకటే రోజులో నోటిఫికేషన్ ఇచ్చి సాయంత్రం వరకు పోస్టులను భర్తీ చేశారు. ఆనాడు అసోసియేట్, అసిస్టెంట్ పోస్టులలో 52 మందిని భర్తీ చేశారు. అందులో ప్రస్తుతం 45 మంది వరకు పని చేస్తున్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ వీసీ హడావుడి నియామకాలపై రోస్టర్ పాయింట్లో నష్టపోయిన అభ్యర్థి వెంకట్ నాయక్ కోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గత నెల చివరిన హైకోర్టు 45 మంది అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియమకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

Case filed against three women under the City Police Act...

  • ఆచార్యుల పై వేటు తప్పదా..?

పుష్కర కాలం తర్వాత రాష్ట్ర అత్యున్నత స్థాయి ఇచ్చిన తీర్పు తెలంగాణ విశ్వవిద్యాలయం టీచర్లలో ఆందోళనకు గురి చేసింది. ప్రొఫెసర్ల పోస్టులకు రిజర్వేషన్లు ఉండవని, ఓపెన్ కేటగిరిలో ఎంపిక కావడంతో కేవలం మూడు పోస్టింగ్ లలో రెండు పోస్టింగ్ లపైనే తీర్పు రావడంతో అసోసేయేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై తీర్పు వచ్చినట్లయింది. అయితే అందులో కొన్ని బ్యాక్ లాగ్ ఉండడంతో వారిపై హైకోర్టు తీర్పు ఏ విధంగా అమలు చేస్తారని సంశయాలున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఉద్యోగాలు ఇచ్చిన 12 ఏళ్ళ తర్వాత తొలగించడం ఎలా అనే యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 90 రోజులు రెగ్యులర్ గా విధులు నిర్వహించిన వారిని తొలగించకుండా రెండు సంవత్సరాలకే ర్యాటిఫై చేయడంతో వారిపై తీర్పు ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ మొదలయింది. గతంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన అధ్యాపకుల నియామకంలో కోర్టు తీర్పు తర్వాత పదోన్నతులు కల్పించడంతో ఇదే సందిగ్ధత పరిస్థితి నెలకొంది. తుదితీర్పు ప్రతులు ఉన్నత విద్యామండలికి, యూనివర్సిటీ అధికారులకు చేరిన తర్వాతనే చర్యలు ఉంటాయని చర్చ జరుగుతుంది.