Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 July 2025, 7:49 pm Posted by : ramakrishna

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై కేసు

నిజామాబాద్ క్రైం , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని అహ్మదీబజార్ లో రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బందిగా ఉన్న  ఆక్రమణలు తొలగించేందుకు ప్రయత్నించిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురిపై రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నిజామాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం రెండవ టౌన్ పరిధిలో జరిగిన ఆక్రమణల తొలగింపు అక్కడ ఉద్రిక్తతలకు కారణమైన నలుగురు మజ్లీస్ నాయకులు, మరో వ్యక్తిపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది. ఫుట్ పాత్ లను , రోడ్డును ఆక్రమించి దందాలు చేస్తున్న వారి దుకాణాల ముందు ఉన్న  ఆక్రమణలు తొలగించవద్దని, వారికి ప్రత్యామ్నాయం చూయించాలని, ఇతర ప్రాంతాల్లో ఆక్రమణలు తొ లగించకుండా ఇక్కడ ఎలా చేస్తారని పలువురు మజ్లీస్ నాయకులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులను రెచ్చగొట్టారు. పోలీసులు సంయమనంతో ఆక్రమణలు తొలగిస్తుంటే వారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించినందుకు వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.