Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 6:22 pm Posted by : ramakrishna

ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

 

. . . ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీలో డీఎంహెచ్ఓ డా.బి రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గ్రామపంచాయతీ త్రాగునీటి నల్లాలకి ఆన్ ఆఫ్ టూటీలను నిర్మించుకోవాలని ఇంటి చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ కూడా నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా.బి రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లోని కీటక జనిత వ్యాధుల నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రపంచ మలేరియా దినోత్సవ అవగాహన ర్యాలీని డీఎంహెచ్ఓ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రాంతంలో వీధుల గుండా ర్యాలీలో దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రై డే, చిన్న ప్రాణులు పెద్ద ప్రమాదం, మనందరి పంతం మలేరియా అంతం, దోమలు పుట్టొద్దు దోమలు కుట్టొద్దు, నీటి నిల్వలను తొలగించండి, దోమతెరలను వాడండి, మన ఆరోగ్యం మన చేతుల్లో లాంటి అవగాహన కలిగించే నినాదాలు చేస్తూ తిరిగి పట్టణ ఆరోగ్య కేంద్రం వద్దకు చేరుకొనీ అక్కడ అవగాహన కలిగించారు.

 

Care should be taken to prevent water accumulation in empty spaces.

 

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 న నిర్వహించుకుంటామని, ప్రజలందరూ దోమల నివారణలో భాగస్వాములు కావాలన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఒకవేళ నమోదవుతే ఆ ఇంట్లో ఇంటి చుట్టుపక్కన నివసించే 100 ఇండ్ల వరకు యాంటీ లార్వెల్ స్ప్రే, కాంటాక్ట్ రక్త పూతల సేకరణ జరపాలని తెలిపు. ఫ్రైడే డ్రైడే నీ పకడ్బందీగా నిర్వహించాలని, పంచాయతీరాజ్, మున్సిపల్, మిగతా శాఖల సమన్వయoతో కార్యక్రమాలు చేపట్టాలని ఇంటి చుట్టూ పాత టైర్లు, పగిలిన కుండలు, కుండీలు, ప్లాస్టిక్ గ్లాసులు, కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పల్లో మొదలగు వాటిల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సికందర్ నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలత, ఏ ఎం ఓ సలీం, డిహెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, సబ్ యూనిట్ అధికారులు, హెచ్ ఈ ఓ లు వెంకట్ రవి, గోవర్ధన్, నాగరాజు లింబారెడ్డి, రవి చందర్, పి హెచ్ ఎన్ సుకన్య, కిషన్, అశోక్ మధుసూదన్ శాంత కుమారి, పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.