మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి
ఎంపీడీవో బషీరుద్దీన్ బాన్సువాడ, బతుకమ్మ : వేసవి కాలం నేపథ్యంలో పల్లె ప్రకృతి వనం నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బషీరుద్దీన్ గ్రామపంచాయతీ కార్యదర్శి దయానంద్ కు సూచించారు. మండలంలోని మొగులానిపల్లి తండా గ్రామంలోని నర్సరీని ఆయన మంగళవారం పరిశీలించారు. నర్సరీలో తెచ్చుకున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో తడి, పొడి చెత్త సేకరణపై ఎంపీడీవో ఆరా తీశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు నీళ్లు పట్టించాలని ఆయన సూచించారు....