ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ బతుకమ్మ, కామారెడ్డి : అధిక వర్షాల ప్రభావం ఇంకా ముగిసిపోనందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అన్నారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి డివిజన్, మండల సాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాలతో చెడిపోయిన రహదారులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే రిపేర్...