Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 3:02 pm Posted by : ramakrishna

రైలు పట్టాలపై నిలిచిన కారు

పెద్దపల్లి, బతుకమ్మ :  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రైల్వే గేటు తెరుచుకోకపోవడంతో ఓ కారు పట్టాలపైనే నిలిచింది. హనుమంతుని పేటకు చెందిన వ్యక్తి కారులో పెద్దపల్లి కి వస్తుండగా కునారం రైల్వే గేట్ వద్ద మొదటి గేటు తెరుచుకోగానే పట్టాలపై వెళ్తుండగా అవతలి వైపు గేటు అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో కారు పట్టాలపై ఉండగానే రైలు వస్తుండగా సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రైలును అక్కడే నిలిపివేయడంతో పెను ప్ర మాదం తప్పింది. అనంతరం రైల్వే సిబ్బంది గేటుకు మరమ్మత్తులు చేసిన తెరుచుకోలేదు. దీంతో ఈ మార్గంలో పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.