Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 8:10 pm Posted by : ramakrishna

44వ జాతీయ రహదారిపై కారు బోల్తా

 

భిక్కనూరు, బతుకమ్మ

 

భిక్కనూరు మండలం బేసిక్ సమీపంలో 44 నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాకు చెందిన వరప్రసాద్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు చిన్నారులకు బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు కారులో వెళ్తుండగా బేసిక్ సమీపంలో కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొని బోల్తా పడింది.

 

Car overturns on National Highway 44

 

ఈ ప్రమాదంలో కారులోని ప్రసాద్ తో సహా ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే జిఎంఆర్ సిబ్బంది వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా బోల్తా పడిన కారును జిఎంఆర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది క్రేన్ సహాయంతో పక్కకు తీయించారు.

Car overturns on National Highway 44