Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 August 2025, 12:39 pm Posted by : ramakrishna

చెట్టును ఢీకొన్న కారు : డ్రైవర్ మృతి

జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల, బతుకమ్మ:  దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా కారు చెట్టు ను ఢీకొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ శివారు  సబ్ స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఐలాపూర్ గ్రామానికి చెందిన బొల్లె పల్లి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనానికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఐలాపూర్ శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గాడి పెళ్లి నరేష్ (36)  అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడ్డ వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.