- అక్కా చెల్లెళ్ల దుర్మరణం
జక్రాన్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ సంఘటనలో నిర్మల్ జిల్లా పెంబి మండలం లోతార్య తాండాకు చెందిన అక్కా చెల్లెళ్లు బాణవత్ అశ్విని (19 ), బాణావత్ మంజుల (17 ) లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. కారును నడుపుతున్న జాదవ్ హంసరాజ్ కు కాలు చేతు విరిగింది. ఎంసేట్ పరిక్ష రాసీ హైద్రాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాధం జరిగిందని జక్రాన్ పల్లి ఎస్ఐ తెలిపారు. మితిమీరిన వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చనిపోయిన వారి డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.