Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2025, 7:05 pm Posted by : ramakrishna

బస్పును ఢీకొట్టిన కారు.. కారును ఢీ కొట్టిన స్కూల్ బస్సు

  • తప్పిన ప్రమాదం

 

నిజామాబాద్  క్రైం, బతుకమ్మ : ఆర్టీసీ బస్సు, స్కూల్  బస్సు మధ్యలో కారు ఇరుక్కుపోయిన ఘటన గురువారం నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని ముబారక్  నగర్ లో గల ఆర్ బీ వీ ఆర్ ఆర్ స్కూల్ వద్ద బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న కారు బస్సును ఢీ కొట్టింది. ఈ కారును వెనుక నుంచి వస్తున్న స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.