Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 4:57 pm Posted by : ramakrishna

ఆటోను ఢీ కొట్టిన కారు

బతుకమ్మ భిక్కనూరు: హైదరాబాదు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ఆగి ఉన్న ఆటోను వెనకాల నుండి ఢీ కొట్టింది.  ఈ ఘటన భిక్కనూరు మండల లోని బస్వాపూర్ బస్టాండ్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి బస్వాపూర్ కు చెందిన మంద స్వామి ఆటో బస్టాండ్ దగ్గర ఆపగా వెనకాల నుండి వచ్చిన కారు టక్కరి ఇవ్వడంతో మంద స్వామి తీవ్రంగా గాయపడ్డాడు. దీనికి కారు అతివేగమే కారణమని గ్రామస్తులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ కాగా పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి గాయపడిన వారిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి అంబులెన్స్ లో స్థానికుల సహాయంతో తరలించారు.

Car hits auto