కారు, ఆర్టీసీ బస్సు ఢీ.. ఒకరి మృతి..

మాక్లూర్, బతుకమ్మ : ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్​ మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్​ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్​నగర్​ వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాక్లూర్​ మండల కేంద్రానికి చెందిన షేక్ మహమ్మదీ (52) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మహమ్మదీ...