కారు, ఎక్సెల్ ఢీ.. ఒకరు మృతి
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మండలం కొయ్యగుట్ట తండా వద్ద మంగళవారం కామారెడ్డి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన భార్యా భర్తలు కేతవత్ వసురం, బూరీ బాయి ఎక్సెల్పై వెళ్తుండగా కామారెడ్డి వైపు నుంచి వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో కేతావత్ వసురం అక్కడికక్కడే మృతి చెందారు. బురీ బాయిని స్థానిక ఏరియా హాస్పిటల్ తరలించారు.