Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 8:56 pm Posted by : ramakrishna

కారు, ఆటో ఢీ.. మహిళకు తీవ్ర గాయాలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్ట్ వద్ద కారు ఆటో ఢీ కొన్నాయి. వివరాలలోకి వెళ్తే నిజాంసాగర్ మండలం ఆరెడ్ గ్రామానికి చెందిన జగన్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులను ఆసుపత్రి కి తీసుకువెళ్లేందుకు యెల్లారెడ్డి వైపు వెళ్తుండగా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను,కారు ఎదురుదురుగా ఢీ కొనడం వలన ఆటో లోని మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీనితో మహిళను హాస్పిటల్ కి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Car and auto collide, woman seriously injured