కెప్టెన్ హబ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో ఆదివారం మెన్స్ డబుల్స్ ఓపెన్, 35 + మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ నిర్వాహకులు కిరణ్, సంతోష్ మాట్లాడారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 73 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై...