Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 January 2025, 7:40 pm Posted by : ramakrishna

కెప్టెన్ హబ్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ ఆధ్వర్యంలో ఆదివారం మెన్స్ డబుల్స్ ఓపెన్, 35  + మెన్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ నిర్వాహకులు కిరణ్, సంతోష్  మాట్లాడారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి 73 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా కెప్టెన్ బ్యాడ్మింటన్ హబ్ సీనియర్ క్రీడాకారులు పసుల అరవింద్, షాదుల్ల ఆధ్వర్యంలో  బాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తుండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. నేటి తరం ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ క్రీడలు, వ్యాయామాలు, యోగా వంటి అభిరుచులను అలవర్చుకుంటున్నారని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు.ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ట్రోఫీ తో పాటు నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లన్న ,రాజు,శౌరబ్,విజయ్,శ్రీనివాస్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.