Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 August 2025, 10:37 pm Posted by : ramakrishna

అబార్షన్లు అడ్డుకోలేరా..?

  • విచ్చల విడిగా భ్రూణ హత్యలు
  • ప్రైవేటు మల్టీ స్పెషాల్టీ హస్పీటల్స్ లో జోరుగా అబార్షన్లు
  • కామారెడ్డిలో లింగ నిర్ధారణ పరిక్షలు
  • అబార్షన్లకు అడ్డాగా మారిన ఇందూర్ హాస్పిటల్స్

 

  • నిజామాబాద్, బతుకమ్మ :

ఏప్రిల్ 1 నుంచి 5 వరకు హైద్రాబాద్ రోడ్ లోని ఓ ప్రముఖ మల్టీ స్పెషాల్టి హాస్పిటల్ లో బోధన్ కు చెందిన అవిహిత యువతికి అబార్షన్ నిర్వహించారు వైద్యులు. 21 వారాల గర్బం తొలిగించాలంటే చాలా కష్టమని డబ్బులు బాగానే లాగేశారు. ఈ విషయంపై మే 27న జిల్లా కలెక్టర్ కు కొందరు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

……………………………………………………………………………………………………………………

నగరంలోని  శ్రీ నగర్ లోని ప్రముఖ ఆసుపత్రిలో ఇద్దరు అడపిల్లలు ఉన్న తల్లికి మూడో బిడ్డగా మళ్లీ పాప పుట్ట నుందని అబార్షన్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కామారెడ్డిలో లింగనిర్ధారణ పరీక్షలను నిర్వహించగా ఆడపిల్ల అని తెలగానే తెలిసిన వారి ద్వార గర్భ విచ్చిత్తికి పాల్పడ్డారు..

…………………………………………………………………………………………………………………

నగరంలోని సరస్వతి నగర్ లో పేషేంట్ లు లేకుండా ఎప్పుడూ ఖాళీగా కనిపించే ఒక ప్రైవేట్ హాస్పిటల్ అబార్షన్ లకు ప్రసిద్ధి అని టాక్. అందులో ఏకైక గైనీక్ తో ఆసుపత్రిని నడుపుతున్న నిర్వాహకులు 24 గంటలలో అబార్షన్ చేసి ఇంటికి పంపిస్తారని ఏజెంట్ లలో చర్చ ఉంది.

………………………………………………………………………………………………………………………………..

ఆడపిల్ల తెలిస్తే చాలు పురిటిలోనే భూమిపైన పడకముందే చంపేస్తున్నారు. ఆడపిల్ల భారమని కొందరు, వారసుల (మగ సంతానం) కోసమని తల్లిదండ్రులే గర్భ విచ్చిత్తికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా యువతలో అవాంచిత గర్భం, మహిళలలో వివాహేతర సంబంధం కారణంగా  భ్రూణ హత్యలు ఆగడం లేదు. ఒకప్పడు గ్రామాలలో పసరు వైద్యం లేదా మంత్రసానుల వద్ధ అవాంచిత గర్భాలను తొలిగించడం అది వికటిస్తే ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకోల్లలు. ఇటీవల కాలంలో గ్రామాలలో గ్రామీణ వైద్యులు అబార్షన్ ల వ్యవహరం అంతా తామై వ్యవహరించిన ఘటనలు ఉన్నాయి. కానీ ఇటీవల మల్టీ స్ఫెషాల్టి హాస్పిటల్స్ లలోను అబార్షన్ లు జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రసూతి వైద్య నిపుణులు ఉన్న ఆసుపత్రులలో ఈ అమానుష ఘటనలు ఆగడం లేదు. ఇటీవల  హైద్రాబాద్ కేంద్రంగా సరోగసీ ద్వారా సంతానం కలిగించే కేంద్రం సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో వెలుగు చూసిన అక్రమాల నేపథ్యంలో టెస్ట్ ట్యూబ్ సెంటర్ లపై  రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  నిజామాబాద్ ఉమ్మడి జిల్ల్లాలో టెస్ట్ ట్యూబ్ బేబి సెంటర్ ల సంగతి దేవుడెరుగు కాని అబార్షన్ ల వ్యవహారాలు కోకోల్లలు.

Can't you stop abortions?

కామారెడ్డి జిల్లా గాంధారీ మండలంలో పనిచేస్తున్న వైద్యుడు కామారెడ్డిలోని తన ప్రైవేట్ క్లినిక్ లో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన వివాహితకు అబార్షన్ కు లింగనిర్ధారణ పరీక్షలు కారణమని బాధిత కుటుంబం పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసుల నమోదు తో పాటు ఆసుపత్రి సీజ్ చేశారు. రాజంపేట్ మండలంలో మొబైల్ స్కానింగ్ సెంటర్ గుట్టును టాస్క్ ఫోర్స్ రట్టు చేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న పలువురిని అరెస్టు చేశారు పోలీసులు. కాని కామారెడ్డి జిల్లాలో లింగనిర్థారణ పరీక్షలు ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లాలోను జరిగే అబార్షన్ లకు స్కానింగ్ కు ఇప్పటికి కామారెడ్డిలోని స్కానింగ్ సెంటర్ ల నిర్వాహకులే ఆధారం అనే చర్చ ఉంది. అంతే గాకుండా కొందరు ఏజెంట్లు అబార్షన్ లకు, లింగనిర్థారణ పరీక్షలను నిర్వహించడంలో ఆరి తెరిపోయారు. కేవలం 10 వేలకు పుట్టేది ఆడో, మగ చెప్పించేస్తున్నారు. దానితో పురిటిలోనే పసికందులు లోకం తెలియకుండానే కన్నుమూస్తున్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అబార్షన్ ల వ్యవహరంపై యంత్రాంగాలు ధ్రుస్టి సారించాలి. గతంలో అనవసరపు సిజేరియన్ లపై నిజామాబాద్ జిల్లాలో అప్పటి కలెక్టర్ లు ప్రత్యేకంగా నజర్ వేశారు. ఆసుపత్రులలో ఎక్కువ సిజేరియన్ ల రికార్డుల ఆధారంగా వార్నింగ్ లు ఇవ్వడమే కాకుండా, కట్టడికి తనిఖీలు నిర్వహించారు. ఇఫ్పుడు సిజేరియన్ లతో పాటు అబార్షన్ లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లాలోను లింగ నిర్ధారణ పరీక్షలపై అధికారుల తనిఖీలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. గతంలో స్కానింగ్ సెంటర్ లలో రెడియాలజిస్టులు, స్కానింగ్ టెక్నిషిన్ లు లేకుండా విక్రుత చేష్టలకు పాల్పడిన ఘటనల నుంచి వైద్య ఆరోగ్య శాఖ గుణపాఠం నేర్చుకోలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ టెస్ట్ ట్యూబ్ బేబీ సేంటర్ లలో తనిఖీలకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో పనిలో పనిగా అబార్షన్లు చేస్తున్న ప్రైవేట్ దవాఖానాలలో తనిఖీలు చేయాలని కోరుతున్నారు.

Can't you stop abortions?