Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 7:20 pm Posted by : ramakrishna

పదేళ్ల ప్రభుత్వంలో పోడు భూములు గుర్తుకు రాలేవా

  • 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకి వెళ్ళినట్టుంది కవిత వ్యవహారం
  • బిజెపి వాళ్ళు త్వరలో దేశాన్ని అమ్మేస్తారు
  • రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతిరెడ్డి

 

మోపాల్, బతుకమ్మ : గత కెసిఆర్ ప్రభుత్వం  పేదవాడికి ఏమి చేయకుండా  ఆలీబాబా నలుగురు దొంగలు లెక్క కెసిఆర్, హరీష్ రావు,  కేటీఆర్, కవిత, సంతోష్ రావులు తెలంగాణను దోచుకున్నారని  తీవ్రంగా  రూరల్ ఎమ్మెల్యే  భూపతి రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా వ్యవసాయ కమిటీ ఆధ్వర్యంలో మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన తాటిపత్రిల పంపిణీ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కెసిఆర్, వారి కుటుంబ సభ్యులు తెలంగాణ పై పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తూ మాజీ ఎంపీ కవిత మోపాల్ మండలంలో తిరుగుతూ పోడు భూముల గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి  అన్నారు. పదేళ్లు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు  పోడు భూముల గురించి ఊసే లేదని, దళితులకు మూడెకరాలు ఇస్తామని పదేళ్ల ప్రభుత్వంలో  వారిని మోసం చేయడం జరిగిందని అన్నారు. 100 ఎలుకలు తిన్న పెళ్లి తీర్థయాత్ర చేసినట్టు కవిత వ్యవహారం ఉన్నదని అన్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని ఇంతవరకు ఇయ్యలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కలను నిజం చేసిందని, కేవలం నిజామాబాద్ రూరల్ 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని నిజామాబాద్

Can't you remember the waste lands during the ten-year government?

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో  పది సంవత్సరాలు చేయని పనిని కేవలం రెండు సంవత్సరాల లో ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచిత రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, 500 లకు గ్యాస్ సిలిండర్, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు సంక్షేమ కోసం రైతు భరోసా, రుణమాఫీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ   వంటి పథకాలను  అందజేశామని అన్నారు. బిజెపి పాలిస్తున్న 15 రాష్ట్రాలలో ఇటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించారు. బిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటే ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఎల్ఐసి లో   పేద ప్రజలు దాచుకున్న డబ్బును  ఆదాని అంబానీలకు నరేంద్ర మోడీ బదిలీ చేసినట్టు  ఆరోపణలు ఉన్నాయన్నారు. పేద ప్రజల డబ్బులను బ్యాంకులను మోసం చేసేవారికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఇలానే దేశాన్ని బిజెపి పాలిస్తే త్వరలో దేశాన్ని మొత్తాన్ని అమ్మేస్తారని  రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పేర్కొన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ  మార్కెట్  కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తాటి పత్రులను మోపాల్ మండల  కేంద్రంలోని  ప్రాథమిక సహకార సంఘంలోని రైతులకు  ఎమ్మెల్యే  చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మోపాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, పిసిసి డెలికేట్  శేఖర్ గౌడ్, మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సాయి రెడ్డి ,ఏఎంసీ డైరెక్టర్లు, సొసైటీ డైరెక్టర్లు, వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Can't you remember the waste lands during the ten-year government?