- హంగార్గాలో గుట్టు రట్టు చేసిన పోలీసులు
- 147 గంజాయి మొక్కలు స్వాధీనం
- పొలం యజమాని అరెస్ట్
జుక్కల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని హంగార్గా గ్రామంలోని శివార్లలో పంటల మధ్య గంజాయి సాగు గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముందస్తు సమచారం మేరకు బిచ్కుంద ఎక్సైజ్ శాఖ అధికారులు, జుక్కల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ అధికారులతో కలిసి శుక్రవారం వీరేశం అనే రైతు పొలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోయా, కంది పంటతో పాటు అంతర్ పంటగా గంజాయి సాగు చేస్తున్న గంజాయిని గుర్తించారు. 147 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని పొలం యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులపై బిచ్కుంద సీఐ సత్య నారాయణ మాట్లాడుతూ గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడులలో తహసీల్దార్ మారుతి, గిర్ధవార్ రామ్ పటేల్, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.