గంజాయి, డ్రగ్స్ ను నియంత్రించాలి

డిచ్పల్లి ఎస్సైకి సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ వినతి బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : డిచ్పల్లి మండలంలో గంజాయి,ఇతర మాదకద్రవ్యాలను నియంత్రించాలని శుక్రవారం డిచ్ పల్లి మండల ఎస్సైకి సీపీఐ (ఎంఎల్)మాస్ లైన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ డిచ్పల్లి మండల కార్యదర్శి బి. మురళి మాట్లాడుతూ డిచ్పల్లి మండలంలో గంజాయి ఇతర మాదకద్రవ్యాలకు విద్యార్థులు, యువత అలవాటు పడుతున్నారని, ఇందుకు డ్రగ్స్ విరివిగా దొరకడమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ముఖ్యంగా విద్యాసంస్థలు దాని...