Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 8:04 pm Posted by : ramakrishna

సీసీఎస్ కానిస్టేబుల్ హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన

రుద్రూర్, బతుకమ్మ: విధి నిర్వాహణలో హత్యకు గురి అయిన నిజామాబాద్ సీసీఎస్  కానిస్టేబుల్ ఈ.ప్రమోద్ హత్యకు నిరసనగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ చత్రపతి శివాజీ చౌక్ వద్ద  ప్రజాసంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు అందరూ కలిసి ఆదివారం రాత్రి కొవ్వొత్తులను ప్రదర్శించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన దొంగ దోపిడీదారుడు కూనికోరు షేక్ రియాజ్ అనే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని లేదా మరణశిక్ష  విధించాలన్నారు. ఒక్క దొంగ 30 కేసుల్లో లేదా 40 కేసుల్లో ఉన్న వాళ్ళని పర్మినెంట్ గా జైల్లో పెట్టే విధంగా చట్టము మార్పులు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.