బతుకమ్మ,మెండోరా: జమ్మూ కాశ్మీర్ పహాల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన అమరుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ మెండోరా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కొవ్వత్తుల శాంతి ర్యాలి నిర్వహించి రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ముత్యం రెడ్డి,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సలీమ్,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.