సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
బతుకమ్మ కోటగిరి:కోటగిరి మండల కేంద్రం లోని బస్టాండ్ వద్ద గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి ఏ.విటల్ గౌడ్ మాట్లాడుతూ... ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకుల మీద ఉగ్రవాదులు చేసిన దాడిలో మరణించిన వారికి నివాళులర్పించుటకు, జాతి ఐక్యతను తెలియచేయడంలో భాగంగానే కొవ్వొత్తులతో సంఘీభావం తెలియజేయడం జరిగిందని అన్నారు....