బోధన్‌లో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ
బతుకమ్మ, బోధన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా బోధన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు.బోధన్ ఎసిపి శ్రీనివాస్, టౌన్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఎసిపి శ్రీనివాస్ మాట్లాడుతూ — “పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువరానివి. వారి త్యాగాల వలన నేడు ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలకు యావత్తు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది,”...