ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

 బతుకమ్మ పోతంగల్ : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో భారతీయ హిందూ టూరిస్టులపై ఉగ్రమూకల  దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోతంగల్ మండల కేంద్రంలో హిందూ సంఘాలు, ముస్లింల ఆధ్వర్యంలో మతాలకతీతంగా  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోతంగల్ అంగడి బజార్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన  నాయకులు ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చేసి సృష్టించిన మారణహోమం పాకిస్తాన్ దుశ్చర్య అని మండిపడ్డారు. పాకిస్తాన్ పై బదులు తీర్చుకోవాలని...