బతుకమ్మ పోతంగల్ : జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం లో భారతీయ హిందూ టూరిస్టులపై ఉగ్రమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తూ పోతంగల్ మండల కేంద్రంలో హిందూ సంఘాలు, ముస్లింల ఆధ్వర్యంలో మతాలకతీతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పోతంగల్ అంగడి బజార్ నుండి బస్టాండ్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన నాయకులు ఉగ్రమూకలపై ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి చేసి సృష్టించిన మారణహోమం పాకిస్తాన్ దుశ్చర్య అని మండిపడ్డారు. పాకిస్తాన్ పై బదులు తీర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కోరారు. భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుందని దేశంలో మతాల మధ్య చిచ్చులు పెట్టేందుకే మతం పేరుతో మారణ హోమం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వాళ్లు ఎన్ని కూచర్యలు చేసినా హిందుస్థాన్ ఐక్యమత్యాన్ని విడదీయలేరన్నారు. జమ్ము కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తివేసి జమ్ము కాశ్మీర్ ను సుందరమైన పర్యాటక రంగంగా తీర్చిదిద్దునందున అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ ప్రజల సంతోషాన్ని చూసి పాకిస్తాన్ వాళ్లు ఓర్వలేక పోతున్నారన్నారు. అందుకోసమే జమ్మూలో ఉగ్రదాడులతో అలజడలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని నరేంద్ర మోడీ తప్పకుండా పాకిస్తాన్ పై బదులు తీర్చుకుంటారని భీమా వ్యక్తం చేశారు. భారతీయుల జోలికి వస్తే ఎలా ఉంటుందో పాకిస్తాన్ కు రుచి చూపాలని మరోమారు భారతదేశం జోలికి రాకుండా తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పబ్బ శేఖర్, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు హకీమ్, బిజెపి మండల అధ్యక్షుడు ప్రకాష్ పటేల్, షేరు, జల్లపల్లి మాజీ ఎంపీటీసీ రాములు, బజరంగ్ హనుమాన్లు,కపిల్, గంధపు పవన్,వెంకాగౌడ్, రాములు, దత్తు, కృష్ణ,మక్కయ్య ఆయా గ్రామాల నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.