ఓటర్లకు మొక్కలను పంపిణీ చేసి ఓట్లు అడిగిన అభ్యర్థి

 పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వినూత్న ప్రచారం కోటగిరి, బతుకమ్మ : ఎన్నికలు అనగానే ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు.. గెలుపు కోసం అభ్యర్థులు చేసే యత్నాలు అన్ని ఇన్ని కావు. గెలవడమే ధ్యేయంగా  కొందరు డబ్బులు పంపిణీ చేస్తే, మరికొందరు మద్యం పంపిణి చేస్తారు.. మరికొందరు మాంసం.. మరికొందరైతే చీరలు.. మరి ఇంకొందరు గిఫ్ట్ లు ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. కానీ పంచాయతీ ఎన్నికల లో కొందరు అభ్యర్థులు పర్యావరణ హితంగా చేస్తున్న ప్రచారం అందరిని ఆలోచింప చేస్తుంది... సర్పంచ్ ఎన్నికలలో  సర్పంచ్ అభ్యర్థులు ...