Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 December 2025, 5:58 pm Posted by : ramakrishna

ఓటర్లకు మొక్కలను పంపిణీ చేసి ఓట్లు అడిగిన అభ్యర్థి

 పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వినూత్న ప్రచారం

కోటగిరి, బతుకమ్మ :

ఎన్నికలు అనగానే ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు.. గెలుపు కోసం అభ్యర్థులు చేసే యత్నాలు అన్ని ఇన్ని కావు. గెలవడమే ధ్యేయంగా  కొందరు డబ్బులు పంపిణీ చేస్తే, మరికొందరు మద్యం పంపిణి చేస్తారు.. మరికొందరు మాంసం.. మరికొందరైతే చీరలు.. మరి ఇంకొందరు గిఫ్ట్ లు ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. కానీ పంచాయతీ ఎన్నికల లో కొందరు అభ్యర్థులు పర్యావరణ హితంగా చేస్తున్న ప్రచారం అందరిని ఆలోచింప చేస్తుంది…

Candidate distributes plants to voters and asks for votes

సర్పంచ్ ఎన్నికలలో  సర్పంచ్ అభ్యర్థులు  తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లో కొత్తగా ఏర్పడిన ఎత్తొండా క్యాంపు గ్రామంలో  సర్పంచ్ అభ్యర్థి బాపప్ప దొడ్డి సంగీత సంఘం బాబు ప్రచారంలో భాగంగా వినూత్నంగా  ఇంటింటికి మొక్కలు పంచుతూ  ప్రచారం చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎత్తోండ క్యాంపు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా  నిలిచిన తనకు వచ్చిన లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.