Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 9:31 pm Posted by : ramakrishna

పవర్ హౌస్ లో కాన్సర్ పై అవగాహన

ఇందూర్, బతుకమ్మ:  పవర్ హౌస్ కాంపౌండ్ లో విద్యుత్ ఉద్యోగుల కోసం కాన్సర్ పై అవగాహనా సదస్సును సోమవారం నిర్వహించారు. డిఈఈ టెక్నికల్ రమేష్ అద్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రి కాన్సర్ నిపుణులు డాక్టర్ రామ కృష్ణ ప్రసాద్ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడున్న పరిస్థితులలో 45 ఏళ్ళు దాటినా వారు రక్త పరీక్షలు చేసుకోవాలన్నారు. బయట చిరుతిళ్ళు, నూనెలో వేసిన పదార్థాలు తినకూడదన్నారు. కాన్సర్ మొదటి దశలో ఉంటే కాపాడుకోవచ్చని, అదే నాలుగవ దశకు చేరుకుంటే చేతులేత్తేయడమేనని డాక్టర్ తెలిపారు. ప్రమాదకరమైన కాన్సర్ వ్యాధిపై పలువురు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఓ పోశెట్టి, యూనియన్ నాయకులు రఘు, పూదరి గంగాధర్, సురేష్, రాజేందేర్ గౌడ్ కాంపౌండ్ ఉద్యోగులు ఉన్నారు.

Cancer awareness at Powerhouse