27 మంది టీచర్ల డిప్యూటేషన్ రద్దు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో ఇటీవల అక్రమంగా డిప్యూటేషన్ పొందిన 27 మంది ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ను రద్దు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి రాజు ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో స్థానిక ఎమ్మెల్యేల సిఫారసుతో సర్దుబాటు పేరుతో ఉపాధ్యాయులను డిప్యూటేషన్ వేశారు. అదే విధంగా కొందరు అధికారులకు డబ్బులు ఇచ్చి డిప్యూటేషన్ వేయించుకున్నట్లు తెలిసింది. దానితో చాలా పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధన ఇబ్బందిగా మారింది. దానిపై ఫిర్యాదులు రాగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విచారణ జరిపారు. 27 మంది ఉపాధ్యాయులు...