Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 2:45 pm Posted by : ramakrishna

ఎస్ఎస్ఆర్ లో క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్

నిజామాబాద్, బతుకమ్మ : ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ లో ఈనెల 9న గురువారం క్యాంపస్ ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాలేజ్ చైర్మన్ డా.మారయ్య గౌడ్ తెలిపారు.. క్యాంపస్ ఇంటర్వూలు గురువారం ఉదయం 10గంటలకు ప్రారంభమవుతాయని తెలిపారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ కంపెనీలలో సర్టిఫైడ్ ఇంటర్ నెట్ కన్స్ ల్టెన్ట్ గా ఉద్యోగ అవకాలుశాలు ఉన్నట్లు తెలిపారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసినవారు, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు అర్హులని తెలిపారు. ఇంటర్వూకు హాజరయ్యే వారు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకుని రావాలని తెలిపారు.