గిరిరాజ్ కళాశాలలో “క్యాంపస్ ఎకో బజార్ – 2025, స్వదేశీ దీపావళి” కార్యక్రమం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో గురువారం "ఏకో క్లబ్" ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ , పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం సహకారంతో "క్యాంపస్ ఎకో బజార్ - 2025, స్వదేశీ దీపావళి" కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాల ఆరోగ్యకారణమైన ఆహార పదార్థాలు స్వయంగా తయారు చేసి, కొత్త రుచులను పరిచయం చేశారని, ప్లాస్టిక్...