Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 October 2025, 5:03 pm Posted by : ramakrishna

గిరిరాజ్  కళాశాలలో  “క్యాంపస్ ఎకో బజార్ – 2025, స్వదేశీ దీపావళి” కార్యక్రమం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్  ప్రభుత్వ కళాశాలలో గురువారం “ఏకో క్లబ్” ఆధ్వర్యంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ , పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ,భారత ప్రభుత్వం సహకారంతో  “క్యాంపస్ ఎకో బజార్ – 2025, స్వదేశీ దీపావళి”  కార్యక్రమంను  ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్  డాక్టర్ పి.రామ్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాల ఆరోగ్యకారణమైన ఆహార పదార్థాలు స్వయంగా తయారు చేసి,  కొత్త రుచులను పరిచయం చేశారని, ప్లాస్టిక్ రహితంగా, పర్యావరణానికి అనుకూలమైన  వస్తువులను  ప్రచారం చేయడం నిమిత్తంగా తక్కువ ధరలకు అమ్మకానికి స్టాల్స్  ఏర్పాటు చేశారని వివరించారు. దీనివల్ల విద్యార్థులకు వస్తువుల అమ్మకం, మార్కెటింగ్ ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, స్టాళ్ల ఏర్పాటు, సుంద రీకరణ, పర్యావరణ స్నేహ పూర్వక ఉత్పత్తులు, సేవలను ప్రచారంచేయడానికి ఈ కార్యక్రమం ఉప యోగపడుతుందని  వివరించారు.ఎకో క్లబ్ సమన్వయకర్త టి. నరేశ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ  ప్రతిభ,నైపుణ్యాలు చూపిన విద్యార్థులకు బహుమతులు,  సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రంగరత్నం, కళాశాల జిల్లా ఎకో క్లబ్ సమన్వయకర్త,  అకాడమిక్ కోఆర్డినేటర్ నహేద బేగం, ఐ.క్యూ.ఏ.సి. కోఆర్డినేటర్ రాజేష్, పి.ఆర్.ఓ. దండుస్వామి,  అధ్యాపకులు వినయ్ కుమార్, రామస్వామి, జయప్రసాద్, వేణుగోపాల్, రమేష్ గౌడ్,  ఎకో క్లబ్ సభ్యులు, రాహుల్, తాబ్సం, మోబినోద్దీన్, బాలామణి, సుమన్, రజిత, రంజిత్, ప్రియాంక, భోజదాస్,   ఏ.ఓ. రామ్ కిషన్, సూరిండెంట్ ఉదయ భాస్కర్, కార్యాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

"Campus Eco Bazaar - 2025, Swadeshi Diwali" program at Giriraj College