ముక్తేశ్వర స్వామి దేవ స్థానంలో కాశీ పండితులచే కర్పూర హారతి

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ నుండి విచ్చేసిన వేద పండితులచే గురువారం కర్పూర హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాశీ పండితులు వేద మంత్రో చ్చారణల మధ్య స్వామివారికి కర్పూర గౌర హారతిని సమర్పించగా, ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ హారతి కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని...