Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 5:13 pm Posted by : ramakrishna

ముక్తేశ్వర స్వామి దేవ స్థానంలో కాశీ పండితులచే కర్పూర హారతి

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కాశీ నుండి విచ్చేసిన వేద పండితులచే గురువారం కర్పూర హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కాశీ పండితులు వేద మంత్రో చ్చారణల మధ్య స్వామివారికి కర్పూర గౌర హారతిని సమర్పించగా, ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. ఈ హారతి కార్యక్రమం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. వేదఘోషలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించాయి.

 

Camphor Aarti performed by Kashi Pandits at the place of Mukteshwara Swamy Deva

 

ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం పొందారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు తదితర అన్ని సదుపాయాలను ఆలయ అధికారులు సమర్థవంతంగా కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు మాట్లాడుతూ, భక్తులు క్రమశిక్షణతో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలను పాటిస్తూ పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వర క్షేత్ర ఆధ్యాత్మిక వైభవం మరింత వెలుగొందిందని, భక్తులలో భక్తి భావం మరింత పెంపొందిందని అధికారులు పేర్కొన్నారు. అనంతరం పూజారులు ఫణీంద్ర శర్మ కాశీ పండితులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

 

Camphor Aarti performed by Kashi Pandits at the place of Mukteshwara Swamy Deva