. కంచర్ల గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం
. హాజరైన కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి
భిక్కనూరు, బతుకమ్మ : నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఏ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. మండలంలోని కంచర్ల లో పోలీసులు, గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ఏఎస్పీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత అసాంఘిక కార్యక లాపాలకు దూరంగా ఉండాలని, గంజాయికి అలవాటు పడి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని అన్నారు. మహిళలు, బాలికలకు ఏవైనా ఇబ్బందులు కలిగితే డయల్ 100, షీటీమును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ ఎస్సై ఆంజనేయులు ఏఎస్ఐ జగదీష్ పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.