నేరాల నియంత్రణలో కెమెరాలు కీలకం

హరిజనవాడలో సీసీ కెమెరాలు ప్రారంభోత్సవం బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని హరిజనవాడలో నేరాల నియంత్రణ కేసుల చేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు అన్నారు. గురువారం హరిజనవాడలో కౌసల్యా దేవి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చన్నారు. హరిజనవాడలో ఏర్పాటు చేసిన జ్ఞాన ప్రకాష్ రెడ్డిని ఎస్ఐ ఆంజనేయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డప్పు రవి గోసు స్వామి భూమయ్య తాటికొండ బాబు పాల్గొన్నారు.