- 852 విద్యార్థుల గైర్హాజరు
- ఒక విద్యార్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారం మొదటి సంవత్సరం బొటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ -1ఏ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 852 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 21,218 మంది విద్యార్థులకు గాను 20,366 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 96 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఒక విద్యార్థి చీటీలు రాస్తుండగా పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 54 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు.. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు తాను ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు, హై పవర్ కమిటీ, బల్క్ అధికారి, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ బోధన్ పట్టణంలోని మధుమలాంఛ జూనియర్ కళాశాల, విద్య వికాస్ జూనియర్ కళాశాల రెండు కేంద్రాలు, బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ జూనియర్ కళాశాల రెండు కేంద్రాలు, విజయ సాయి, షిరిడీ సాయి జూనియర్ కళాశాల లను తనిఖీ చేసి సమీక్షించారు.