Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 March 2025, 7:00 pm Posted by : ramakrishna

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

  • 831 మంది విద్యార్థులు గైర్హాజరు
  • ఒక విద్యార్ధి పై మాల్ ప్రాక్టీస్ కేసు 

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు సోమవారం మొదటి సంవత్సరం ఎకనామిక్స్, ఫిజిక్స్  పరీక్ష  ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు.  మొత్తం 831 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. సోమవారం డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్  కళాశాలలో చీటీలు రాస్తూ కాపీయింగ్ చేస్తున్న ఒక  విద్యార్ధి పై మాల్ ప్రాక్టీసు కేసు నమోదు చేశామని జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.  మొత్తం 95.9 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీటీలు రాస్తున్న ఓ విద్యార్థి ని చీఫ్ సూపరింటెండెంట్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు.       జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 54 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దిన్ అస్లాం, కనకమహా లక్ష్మి, ముగ్గురు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు,  హై పవర్ శ్రీనాథ్ కమిటీ, బల్క్ అధికారి బుద్దిరాజ్ లు, కస్టోడియన్లు  పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారు.