- 477 విద్యార్థులు గైర్హాజరు
- ఇద్దరు విద్యార్డుల పై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం రెండవ సంవత్సరం బొటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్ -2ఏ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలియజేశారు. మొత్తం 477 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. జిల్లాలో మొత్తం 17,064 మంది విద్యార్థులకు గాను 16,587 విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలియజేశారు. మొత్తం 97.2 శాతం విద్యార్థులు పరీక్షలు రాయగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. బోధన్ లోని విజేత జూనియర్ కళాశాల లో ఇద్దరు విద్యార్థులు చీటీలు రాస్తుండగా చీఫ్ సూపరింటెండెంట్ పట్టుకుని మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలిపారు. జిల్లాలో మొత్తం 57 పరీక్ష కేంద్రాలకు గాను 51 పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేశారు.జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ తో పాటు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, రజియుద్దిన్ అస్లాం, శ్రీమతి కనకమహా లక్ష్మి, ముగ్గురు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లు, హై పవర్ శ్రీనాథ్ కమిటీ, బల్క్ అధికారి బుద్దిరాజ్ లు, కస్టోడియన్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షణ చేసారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ నిజామాబాద్ పట్టణంలోని కాకతీయ జూనియర్ కళాశాల లు మూడు కేంద్రాలను, నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సత్య ఒకేషనల్ జూనియర్ కళాశాల, కంటేశ్వర్ లోని ఎస్ ఆర్ జూనియర్ కళాశాల, కంటేశ్వర్ ఉమెన్స్ జూనియర్ కళాశాల, వాగ్దేవి జూనియర్ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు.