కోర్టు పేరు చెప్పి పటాకుల దందా

దశాబ్ధంకు పైగా స్టే వెకెట్ చేయించడంలో యంత్రాంగం విఫలం ప్రభుత్వ శాఖల సమన్వయలోపంతో టపాసుల విక్రయ దందా నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ప్రమాదకర పరిస్థితుల్లో జరుగుతున్న పటాకుల విక్రయాల దందాపై జిల్లా అధికార యంత్రాంగం చోద్యం చూస్తుంది. రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా దీపావళి సమయంలో పటాకుల తయారి విక్రయాల వద్ద ప్రమాదాలు భయపెడుతున్నా జిల్లా అధికార యంత్రాంగంలో మాత్రం చలనం లేదు. ప్రధానంగా నిజామాబాద్ నగర నడిబొడ్డున కిసాన్ గంజ్ లో కోట్ల రూపాయల టన్నులకొద్ది పటాకుల విక్రయాల...