మీ సేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో నూతనంగా మంజూరైన మీసేవా కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. స్థానికంగా ఉన్న అర్హులైన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కేంద్రం నిర్వహణకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ అంతకంటే పై చదువులు పూర్తి చేసి ఉండాలని, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి సంబంధిత సర్టిఫికెట్ సమర్పించాల్సి...