నిజామాబాద్, బతుకమ్మ: నేషనల్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ క్యాలెండర్, పాకెట్ క్యాలెండర్ ను నగరంలోని జిల్లా పోస్టల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో దక్కన్ సర్కార్ సినిమా డైరెక్టర్ కళా శ్రీనివాస్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీసర్ (ఐపీఎస్ కేడర్) జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సురేఖ, జిల్లా మార్కెటింగ్ ఎగ్జిక్యూటీవ్ రాజేశ్వర్ గౌడ్, యూనియన్ తెలంగాణ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, పోస్టల్ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
