నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
విద్యాశాఖ ఉద్యోగుల ఫోరం జిల్లా క్యాలెండర్ ను ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్ లోని విద్యాశాఖ కార్యాలయంలో విద్యాశాఖ ఫోరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమార్, అశ్విన్ ల అధ్యక్షతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేని (ముజీబ్) అధ్యక్షతన త్వరలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే టీఎన్జీవో 80 వసంతాల కార్యక్రమానికి ప్రతి ప్రాథమిక సభ్యుడు ఉద్యమస్ఫూర్తితో విచ్చేసి హక్కుల సాధన కొరకై తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, సదరు శాఖ అధికారులు ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.