సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదా
హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి పదవి ఆశించిన ఇద్దరి ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు ఇచ్చారు. ప్రభుత్వ సలహాదారుగా బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డని నియమించారు. ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతను కూడా ఆయనకే అప్పగించారు. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా సుదర్శన్ రెడ్డి ఉండనున్నారు. మంత్రులకు ఉండే సదుపాయాలన్ని ఆయనకు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అలాగే ఎమ్మెల్యే ప్రేం సాగర్ రావును పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించారు.